Mulikipalli: కార్యకర్తలకు పార్టీ ఐడీ కార్డులను పంపిణీ చేసిన వైఎస్సార్‌సీపీ నేతలు!

Mulikipalli: ములికిపల్లిలో వైఎస్సార్‌సీపీ గ్రామస్థాయి కార్యకర్తల సమావేశం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై దిశానిర్దేశం చేసిన రాజేశ్వరి దేవి.

PRABHU, RAZOLE
Published on: 8 Oct 2026 5:03 PM IST
Mulikipalli
X

Mulikipalli: కార్యకర్తలకు పార్టీ ఐడీ కార్డులను పంపిణీ చేసిన వైఎస్సార్‌సీపీ నేతలు!

Mulikipalli: అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం ములికిపల్లి గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ శ్రీమతి పాముల రాజేశ్వరి దేవి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ముందుగా డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రామంలోని నాయకులు, కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని పాముల రాజేశ్వరి దేవి సూచించారు.

అనంతరం సమావేశంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలకు పార్టీ ఐడీ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాముల దేవిప్రకాష్, మండల అధ్యక్షుడు కట్టా శ్రీను, గ్రామశాఖ అధ్యక్షుడు సత్య ప్రసాద్, కంచర్ల శేఖర్, ఇతర గ్రామాల అధ్యక్షులు గుబ్బల మనోహర్‌తో పాటు ములికిపల్లి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE