Chintoor: ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కారం నవ్య!
Chintoor: చింతూరు పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కారం నవ్య గ్రామ గ్రామాన విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.
Chintoor: ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కారం నవ్య!
Chintoor: చింతూరు మండలం చింతూరు పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కారం నవ్య ప్రచారంలో సంచలనం సృష్టిస్తున్నారు. పంచాయతీ పరిధిలోని గ్రామ గ్రామాన తిరుగుతూ, ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల ఆశీస్సులు కోరుతున్నారు.
నవ్య వెళ్లిన ప్రతి చోటా జనం బ్రహ్మరథం పడుతున్నారు. మహిళలు హారతులతో స్వాగతం పలుకుతుంటే, యువకులు వెంట నడుస్తూ జై కొడుతున్నారు. "మా ఓటు నవ్యకే" అంటూ ఓటర్లు స్వయంగా మద్దతు ప్రకటిస్తుండటంతో చింతూరులో ఎన్నికల వేడి ఒక్కసారిగా పెరిగింది.
ప్రచారంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ రామలింగారెడ్డి, శ్రీలత రెడ్డిలు పాల్గొని, నవ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. గ్రామ అభివృద్ధి, మహిళా సంక్షేమమే నవ్య లక్ష్యమని వారు తెలిపారు. ఓటర్ల నుంచి లభిస్తున్న ఈ అపూర్వ ఆదరణ చూస్తుంటే చింతూరు పంచాయతీలో నవ్య విజయం ఖాయమన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.




