Chintalapalli: రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు యువత ముందుకు రావాలి
Chintalapalli: రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు యువత ముందుకు రావాలని కోరుతూ కోనసీమ జిల్లా రాజోలు మండలం చింతలపల్లిలో దళిత చైతన్య వేదిక ఆధ్వర్యంలో 'ఇంటింటా అంబేడ్కర్' నిర్వహించారు.
Chintalapalli: రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు యువత ముందుకు రావాలి
చింతలపల్లి: రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు, అంబేడ్కర్ ఆశయాల సాధనకు దళిత యువత చైతన్యవంతమై ముందుకు రావాలని దళిత చైతన్య వేదిక నాయకులు పిలుపునిచ్చారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం చింతలపల్లి గ్రామం విజ్ఞాన్ నగర్లో బత్తుల సరస్వతీరావు ఆధ్వర్యంలో శుక్రవారం ‘ఇంటింటా అంబేడ్కర్’ కార్యక్రమం నిర్వహించారు. తొలుత నల్లి నాగబాబు, గెడ్డం సత్యనారాయణ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇంటింటికీ అంబేడ్కర్ జీవిత విశేషాల పుస్తకాలను పంపిణీ చేస్తూ, ఆయన ముఖచిత్రంతో కూడిన స్టిక్కర్లను అతికించి ఆశయాలను వివరించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అణగారిన వర్గాల అభ్యున్నతి, సామాజిక న్యాయం, రాజ్యాధికార సాధన దిశగా యువత చైతన్యంతో ముందుకు సాగాలని అన్నారు.
కార్యక్రమంలో వేదిక వ్యవస్థాపకులు బత్తుల మురళీకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలకపాటి శ్రీధర్, మండల అధ్యక్షులు మందపాటి మధుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




