Malikipuram: మలికిపురంలో యువతిని మోసం చేసి గర్భస్రావం చేయించిన ఘటనపై కేసు!

Malikipuram: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలంలో పెళ్లి చేసుకుంటానని నమ్మి మోసం చేయడంతో పాటు గర్భస్రావం చేయించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

PRABHU, RAZOLE
Published on: 1 Oct 2026 9:21 AM IST
Malikipuram
X

Malikipuram: మలికిపురంలో యువతిని మోసం చేసి గర్భస్రావం చేయించిన ఘటనపై కేసు!

Malikipuram: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకుని, గర్భం దాల్చిన అనంతరం గర్భస్రావం చేయించినట్లు ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన 30 ఏళ్ల ఎస్సీ యువకుడు, 27 ఏళ్ల ఎస్సీ యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమె నుంచి డబ్బులు, బంగారు వస్తువులు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఆమెతో శారీరక సంబంధం ఏర్పరచుకోవడంతో గర్భం దాల్చినట్లు, టాబ్లెట్లు ఇచ్చి గర్భస్రావం చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. తాను విదేశాలకు వెళ్లి అక్కడ స్థిరపడిన తర్వాత తిరిగి వచ్చి పెళ్లి చేసుకుంటానని యువతికి హామీ ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, యువతి తల్లిదండ్రులు గల్ఫ్ దేశం నుంచి స్వగ్రామానికి వచ్చిన అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి యువకుడి ఇంటికి వెళ్లి పెళ్లి విషయమై ప్రశ్నించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా యువకుడి తల్లి సహా కుటుంబానికి చెందిన ఆరుగురు తమను బెదిరించి, పెళ్లి చేయబోమని, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీంతో బాధిత యువతి మలికిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, సీఐ సురేష్‌ బాబు ఆద్వర్యంలో ఎస్సై మోహన్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE