Kadiyam: వైయస్సార్సీపీ నాయకులు జక్కంపూడి రాజా జన్మదిన వేడుకలు!
Kadiyam: కడియపు సావరంలో వైయస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు జక్కంపూడి రాజా జన్మదిన వేడుకలను నాయకులు, యువత ఘనంగా నిర్వహించారు.
Kadiyam: వైయస్సార్సీపీ నాయకులు జక్కంపూడి రాజా జన్మదిన వేడుకలు!
Kadiyam: వైసిపి రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు రాజానగరం మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా జన్మదిన వేడుకలు కడియపు సావరం వైసీపీ నాయకులు సాపిరెడ్డి కామేష్, జ్యోతుల అర్జున్, ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు, పార్టీ జిల్లా జనరల్ సెక్రెటరీ తాడాల చక్రవర్తి పాల్గొని కడియం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బిస్కెట్లు, జ్యూస్ ప్యాకెట్లు అందజేశారు. కడియపు సావరం యువత కేక్ కట్ చేసి రాజా జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆకుల సుధాకర్, నాగిరెడ్డి మోహన్, జ్యోతుల వీరబాబు, చిలుకూరి రామకృష్ణ, కొక్కిరాల వెంకటేశ్వరరావు, పడాల శివ, దేవరకొండ జాను, బాలం వాసు, దుంగాలా గౌరీ శేఖర్, జ్యోతుల గణేష్, మణి తదితరులు పాల్గొన్నారు.




