Malikipuram: జంతు సంరక్షణపై కళా సందేశం: చిత్రకారుడు సంగీత్ ప్రదర్శన

Malikipuram: అంతర్జాతీయ జంతు దినోత్సవం సందర్భంగా మలికిపురంలో చిత్రకారుడు ఎన్. సంగీత్ ఏర్పాటు చేసిన జంతు సంరక్షణ చిత్ర ప్రదర్శన ఆలోచింపజేసింది.

PRABHU, RAZOLE
Published on: 4 Oct 2026 3:33 PM IST
Malikipuram
X

Malikipuram: జంతు సంరక్షణపై కళా సందేశం: చిత్రకారుడు సంగీత్ ప్రదర్శన

మలికిపురం: అంతర్జాతీయ జంతు దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం గ్రామానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు, జాతీయ అవార్డు గ్రహీత ఎన్. సంగీత్ తన సునయన ఆర్ట్స్ అకాడమీలో ప్రత్యేక చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. జంతు సంపద పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, జంతువుల హక్కులు, పర్యావరణ పరిరక్షణ అంశాలను ప్రతిబింబించేలా ఆయన గీసిన చిత్రాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

ప్లాస్టిక్ కవర్లను తినడం వల్ల అనేక మూగజీవులు మృత్యువాత పడుతున్న దృశ్యాలను చిత్రాల ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించాలని సందేశం ఇచ్చారు. వన్యప్రాణుల మనుగడను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతని, ప్రకృతిలోని ప్రతి జీవిని సంరక్షించినప్పుడే పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని ఎన్. సంగీత్ తెలిపారు. ఆయన చిత్ర ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకోవడంతో పాటు జంతు సంరక్షణపై ఆలోచింపజేస్తోంది.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE