Sivakoti: కూటమి సమన్వయంతో స్థానిక ఎన్నికల్లో ముందుకు: గొల్లపల్లి అమూల్య
Sivakoti: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సమన్వయంతో సాగాలని రాజోలు టీడీపీ ఇన్‌చార్జ్ గొల్లపల్లి అమూల్య శివకోటి ‘కేడర్ విత్ లీడర్’ వేదికగా పిలుపునిచ్చారు.
Sivakoti: కూటమి సమన్వయంతో స్థానిక ఎన్నికల్లో ముందుకు: గొల్లపల్లి అమూల్య
శివకోటి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీలు పరస్పర సమన్వయంతో ముందుకు సాగాలని రాజోలు టీడీపీ ఇన్‌చార్జ్, రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి గొల్లపల్లి అమూల్య పిలుపునిచ్చారు. రాజోలు మండలం శివకోటిలోని టీడీపీ కార్యాలయం వద్ద శుక్రవారం 48వ వారం ‘కేడర్ విత్ లీడర్’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు.
ముందుగా మహాత్మా గాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు, స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం మహనీయులు చేసిన త్యాగాలు, సేవలు చిరస్మరణీయమని అమూల్య పేర్కొన్నారు. వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజాసేవలో ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
స్థానిక ఎన్నికల్లో గ్రామానికి మేలు చేసే సమర్థులైన అభ్యర్థులను ఎంపిక చేసి, కూటమి పార్టీలన్నీ ఐక్యంగా పనిచేయాలని ఆమె కోరారు. ఇటీవల విద్యా కమిటీ ఎన్నికల్లో విజయం సాధించిన చైర్మన్లను సత్కరించి అభినందించారు. అనంతరం వివిధ గ్రామాల ప్రజలు, కూటమి శ్రేణులు అందజేసిన ప్రజా సమస్యలు, సీఎం రిలీఫ్ ఫండ్‌కు సంబంధించిన అర్జీలను స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు పెచ్చెట్టి నరసింహారావు (బాబు), పలువురు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామశాఖ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




