Mummidivaram: నిరుపేద కుటుంబాల గుర్తింపుపై మహిళా సమాఖ్య సభ్యులకు శిక్షణ!

Mummidivaram: అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలో జీరో పావర్టీ మిషన్‌లో భాగంగా నిరుపేద కుటుంబాలను గుర్తించడంపై మహిళా సమాఖ్య సభ్యులు, గ్రామ సంఘాల లీడర్లకు శిక్షణ ఇచ్చారు.

M. Suneel Sastry, Mummidivaram
Published on: 9 Oct 2026 1:40 PM IST
Mummidivaram
X

Mummidivaram: నిరుపేద కుటుంబాల గుర్తింపుపై మహిళా సమాఖ్య సభ్యులకు శిక్షణ!

Mummidivaram: రాష్ట్ర ప్రభుత్వ జీరో పావర్టీ మిషన్‌లో భాగంగా నిరుపేద కుటుంబాలను గుర్తించి, వారి వివరాలతో సమగ్ర నివేదికలు రూపొందించడంపై ముమ్మిడివరం మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సంఘాల లీడర్లు, గ్రామ సంస్థ సహాయకులు (VOA) పాల్గొన్నారు.

ప్రణాళిక శాఖ ద్వారా గ్రామ సచివాలయాల వారీగా అందే నిరుపేద కుటుంబాల జాబితాలను గ్రామ సంఘాల సమావేశాల్లో చర్చించి, అర్హులైన కుటుంబాల వివరాలను యాప్‌ ద్వారా సర్వే చేయాలని శిక్షణలో వివరించారు. పేదరిక నిర్మూలన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికకు అనుగుణంగా ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని ఏపీఎం పీవీవీ రమణ సూచించారు.

ఈ శిక్షణలో సీసీలు మల్లాడి లక్ష్మి, జయలక్ష్మి, రత్నంతో పాటు మండల సమాఖ్య నాయకులు రోచర్ల నాగమణి, నక్క హైమావతి, కామాడి జయలక్ష్మి, గ్రామ సంఘాల లీడర్లు, వీఓఏలు పాల్గొన్నారు.

M. Suneel Sastry, Mummidivaram

M. Suneel Sastry, Mummidivaram