Palakollu: విచారణకు వస్తూ గోదావరిలోకి దూకిన సొసైటీ స్కామ్ సూత్రధారి!
Palakollu: రూ.2 కోట్ల స్కామ్ కేసు విచారణకు వస్తూ యలమంచిలి చించినాడ బ్రిడ్జిపై నుంచి గోదావరిలో దూకి గొర్తి శ్రీనివాసరావు గల్లంతయ్యాడు. గాలింపు ముమ్మరం.
Palakollu: విచారణకు వస్తూ గోదావరిలోకి దూకిన సొసైటీ స్కామ్ సూత్రధారి!
Palakollu: యలమంచిలి మండలంలో చించినాడ బ్రిడ్జి పై నుండి గోదావరిలో దూకి గల్లంతయిన గొర్తి శ్రీనివాసరావు(43) డా. బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామానికి చెందిన వ్యక్తి. విజయవాడలో బ్రాహ్మణ క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ ఉద్యోగి గా శ్రీనివాస్ పనిచేస్తున్నాడు.
సొసైటీలో సుమారు 2 కోట్లు అవకతవకలకు శ్రీనివాసరావు పాల్పడినట్లు తెలిపారు. అధికారులు ప్రశ్నించగా స్వగ్రామంలో బంగారం ఉంది, ఇస్తాను అని నమ్మబలికి అధికారులను వెంట బెట్టుకుని తీసుకువచ్చిన శ్రీనివాసరావు చించినాడ బ్రిడ్జి వద్ద వాంతు వస్తుంది ఆపమని,
బ్రిడ్జిపై నుండి గోదావరిలో దుకాడని సొసైటీ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన యలమంచిలి పోలీసులు. గల్లంతైన వ్యక్తి కోసం గజ ఈతగాళ్ల సాయంతో పోలీసులు గాలింపు చేపట్టారు




