Polavaram: యుద్ధప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు కలెక్టర్

Polavaram: పోలవరం జిల్లాలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ వేగవంతం. 350 మంది సిబ్బందితో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడి.

Prasanna, Rampachodavaram
Published on: 28 Oct 2026 8:44 PM IST
Polavaram
X

Polavaram: యుద్ధప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు కలెక్టర్

పోలవరం: పోలవరం కలెక్టర్‌ కె.దినేష్‌ కుమార్ భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా జిల్లాలో స్తంభించిన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు విద్యుత్ శాఖ చర్యలను వేగవంతం చేసిందని పోలవరం జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్ తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతున్నట్లు చెప్పారు.

బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విద్యుత్‌ పునరుద్ధరణ పనుల వివరాలను వెల్లడించారు. ​350 మందితో ప్రత్యేక బృందాలు జిల్లా వ్యాప్తంగా సుమారు 350 మంది విద్యుత్ సిబ్బంది పునరుద్ధరణ పనుల్లో పాల్గొంటున్నారని కలెక్టర్ తెలిపారు. ప్రతి మండలానికి ఒక అసిస్టెంట్ ఇంజినీర్ (AE)ను నియమించడంతో పాటు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామన్నారు. ముందస్తుగా విద్యుత్ స్తంభాలు, జేసీబీ యంత్రాలను సిద్ధం చేసుకోవడంతో పనులు వేగంగా సాగుతున్నాయని పేర్కొన్నారు.

​జిల్లాలోని మొత్తం 12 సబ్‌స్టేషన్లలో విద్యుత్ సరఫరాను ఇప్పటికే పునరుద్ధరించినట్లు వెల్లడించారు. సాయంత్రం 5 గంటల నాటికి మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ విద్యుత్ అందుబాటులోకి వస్తుందన్నారు.

​ప్రధాన ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి గ్రామాలకు వెళ్లే ఎల్‌టీ లైన్ల మరమ్మతులు ముమ్మరంగా జరుగుతున్నాయని, రాత్రి వేళల్లోనూ సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు.

​వై.రామవరం, అడ్డతీగల మండలాల్లో పనులు పురోగతిలో.. మిగిలిన మండలాల్లో విద్యుత్ పునరుద్ధరణ పూర్తయినప్పటికీ.. వై.రామవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి మండలాల్లోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో పనులు ఇంకా జరుగు తున్నాయని, అక్కడ కూడా త్వరలోనే పూర్తి చేస్తామని కలెక్టర్ చెప్పారు.

​ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

తుపాను ప్రభావంతో భారీ వర్షాలు, గాలులు వీచే ప్రమాదం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. తెగిపడిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని, నీటితో నిండిన ప్రాంతాల్లో విద్యుత్ పరికరాలను ముట్టుకోవద్దని హెచ్చరించారు. జిల్లా యంత్రాంగం చేపడుతున్న సహాయక చర్యలకు ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు.

తుపాను ప్రభావం పెరిగే అవకాశం ఉండటంతో జిల్లాలో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని కలెక్టర్ సూచించారు. విద్యుత్ తీగలు తెగిపడిన ప్రాంతాలకు దూరంగా ఉండాలని, నీటితో నిండిన ప్రాంతాల్లో విద్యుత్ పరికరాలను తాకరాదని కలెక్టర్ కోరారు.

తుపాను పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం చేపడుతున్న సహాయక చర్యలకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ తుఫాను వలన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువలన జిల్లాలోని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాగులు దాటకుండా చాలా అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు. పోలవరం జిల్లాలోని తుఫాను ప్రభావం వలన మెయిన్ రోడ్లపై చెట్లు పడిపోయే ప్రమాదం ఉన్నందువలన రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జెసిబిలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.

జిల్లా కలెక్టర్ వారి వెంట ఏడీఈ మహాకాళేశ్వరరావు, ఈ ఈ అచ్యుతరావు, తాసిల్దార్ సిహెచ్ బాలాజీ, డిఈ భవాని ఎఇ శ్రీనివాసరావు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Prasanna, Rampachodavaram

Prasanna, Rampachodavaram