Rajole: రాజోలులో ఉధృతమైన వీఆర్ఏల నిరసన - వర్షంలోనూ అర్ధనగ్న ప్రదర్శన!

Rajole: సమస్యల పరిష్కారం కోరుతూ రాజోలు తహశిల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏల అర్ధనగ్న ప్రదర్శన. 9 రోజులుగా కొనసాగుతున్న సహాయ నిరాకరణ ఉద్యమం.

PRABHU, RAZOLE
Published on: 24 Sept 2026 1:38 PM IST
Rajole
X

Rajole: రాజోలులో ఉధృతమైన వీఆర్ఏల నిరసన - వర్షంలోనూ అర్ధనగ్న ప్రదర్శన!

Rajole: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ వీఆర్ఏలు తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన నిరసన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తున్నారు. ఏపీ వీఆర్ఏ జేఏసీ సంఘం పిలుపు మేరకు గత తొమ్మిది రోజులుగా సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా సమ్మె కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా రాజోలు తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏలు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి ప్రభుత్వానికి తమ సమస్యలను తెలియజేశారు. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా గ్రామస్థాయిలో ప్రభుత్వ సేవలను అందిస్తూ విధులు నిర్వహిస్తున్న తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అర్హత కలిగిన వీఆర్ఏలకు పదోన్నతులు కల్పించడంతో పాటు పే స్కేల్ అమలు చేయాలని, నామినీ వీఆర్ఏలను గుర్తించి వారికి న్యాయం చేయాలని కోరారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.

వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు

అర్హులైన వీఆర్ఏలకు పదోన్నతులు కల్పించాలి.

వీఆర్ఏలకు పే స్కేల్ వర్తింపజేయాలి.

నామినీ వీఆర్ఏలను గుర్తించి న్యాయం చేయాలి.

ఈ డిమాండ్ల సాధన కోసం నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు దారపురెడ్డి వీరభద్రం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉపాధ్యాయ సంఘాలైన యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు కె. రాజబాబు, జిల్లా కార్యదర్శి ఏ. కాశీ విశ్వేశ్వరరావు, ఆర్. నాగేశ్వరరావు, నాయకులు ఉండవల్లి శ్రీనివాసరావు, పారి దుర్గాప్రసాద్, ప్రధాన కార్యదర్శి కె. రవికుమార్, డి. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE