Rajole: రాజోలులో 13వ రోజూ కొనసాగుతున్న వీఆర్ఏల నిరసన ఆందోళనలు!
Rajole: రాజోలు తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏలు మోకాళ్లపై నిలబడి 13వ రోజు వినూత్న నిరసన తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు.
Rajole: రాజోలులో 13వ రోజూ కొనసాగుతున్న వీఆర్ఏల నిరసన ఆందోళనలు!
Rajole: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం వీఆర్ఏలు చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం 13వ రోజుకు చేరుకుంది. రాజోలు తహసీల్దార్ కార్యాలయం వద్ద మోకాళ్లపై నిలబడి వినూత్న రీతిలో నిరసన తెలిపుతు ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.
13 రోజులుగా వివిధ రూపాల్లో నిరసనలు చేపడుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన స్పందన లేకపోవడంపై వీఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు కేవలం ఉద్యోగ సంబంధమైనవి కాకుండా తమ కుటుంబాల జీవనోపాధికి సంబంధించినవని పేర్కొన్నారు.
అర్హత కలిగిన వీఆర్ఏలకు పదోన్నతులు కల్పించాలని, పే స్కేల్ అమలు చేయాలని, నామినీ వీఆర్ఏలను గుర్తించాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణలో అమలు చేస్తున్న విధంగా జీతాలను పెంచి తమ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలని కోరారు.
అధికారులు ఇకనైనా స్పందించి చర్చలు జరిపి సమస్యలకు పరిష్కారం చూపాలని వీఆర్ఏలు విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని, అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.




