Razole: రాజోలులో ఐదో రోజుకు చేరిన వీఆర్ఏల సహాయ నిరాకరణ సమ్మె!

Razole: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలులో ఐదో రోజుకు చేరుకున్న వీఆర్ఏల సహాయ నిరాకరణ సమ్మె.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్.

PRABHU, RAZOLE
Published on: 20 Sept 2026 12:54 PM IST
Razole
X

Razole: రాజోలులో ఐదో రోజుకు చేరిన వీఆర్ఏల సహాయ నిరాకరణ సమ్మె!

Razole: బీ.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏలు) చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమ సమ్మె ఐదో రోజుకు చేరుకుంది. తమ దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏలు ఆందోళనను కొనసాగిస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసన చేపడుతూ ప్రభుత్వ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయడంతో పాటు, అర్హత కలిగిన ఉద్యోగులకు వెంటనే ప్రమోషన్లు కల్పించాలని వారు కోరుతున్నారు. అలాగే నామిని వీఆర్ఏలను వెంటనే గుర్తించి, వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నో సంవత్సరాలుగా రెవెన్యూ శాఖలో విధులు నిర్వహిస్తున్న తమ సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE