Rajole: రాజోలులో ఆరో రోజుకు చేరిన వీఆర్ఏల సహాయ నిరాకరణ ఉద్యమ సమ్మె!

Rajole: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆరో రోజు కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మె ও వంట వార్పు నిరసన.

PRABHU, RAZOLE
Published on: 21 Sept 2026 1:33 PM IST
Rajole
X

Rajole: రాజోలులో ఆరో రోజుకు చేరిన వీఆర్ఏల సహాయ నిరాకరణ ఉద్యమ సమ్మె!

Rajole: తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏలు) చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమ సమ్మె ఆరో రోజుకు చేరుకుంది. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు శాంతియుతంగా నిరసన కొనసాగిస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, తమకు తగిన న్యాయం చేయాలని కోరుతూ ఆందోళన చేపడుతున్నారు.

సమ్మెలో భాగంగా తహసీల్దార్ కార్యాలయం ఎదుట వంట వార్పు కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా రెవెన్యూ శాఖలో అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న తమ సమస్యలను ప్రభుత్వం ఇకనైనా సానుకూలంగా పరిగణించి పరిష్కరించాలని వీఆర్ఏలు విజ్ఞప్తి చేశారు.

వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయడంతో పాటు, అర్హత కలిగిన ఉద్యోగులకు తక్షణమే ప్రమోషన్లు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా నామిని వీఆర్ఏలను వెంటనే గుర్తించి, వారికి న్యాయం చేయాలని కోరారు. తమ కుటుంబాల భవిష్యత్తు, ఉద్యోగ భద్రతతో ముడిపడి ఉన్న సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించే వరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని వీఆర్ఏలు స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి, విధుల్లో ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించాలని వారు కోరుతున్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE