VR Puram: కారు-ఆటో ఢీకొని వృద్ధుడు మృతి, మహిళకు తీవ్రగాయాలు!
VR Puram: విఆర్ పురం అడవివెంకన్నగూడెం మూలమలుపు వద్ద కారు-ఆటో ఢీకొని ఒకరు మృతి, మహిళకు తీవ్రగాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
VR Puram: కారు-ఆటో ఢీకొని వృద్ధుడు మృతి, మహిళకు తీవ్రగాయాలు!
వి ఆర్ పురం: విఆర్ పురం మండలం అడివివెంకన్నగూడెం గ్రామ మూలమలుపు వద్ద బుధవారం కారు ఆటో ఢీ కొట్టుకున్నాయి.ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొక మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి.వివరాల్లోకి వెళితే ఓ ఆటో 5 గురు ప్రయాణికులతో విఆర్ పురం వైపు వెళ్తుంది.
ఈ సమయంలో వి ఆర్ పురం నుండి చింతూరు వైపు వస్తున్న కారు అడవి వెంకన్నగూడెం మూలమలుపు వద్ద కారు ఆటో ఢీ కొట్టుకున్నాయి.ఈ ప్రమాదంలో సోములగూడెం కు చెందిన మిడియం సత్యనారాయణ(60), చొప్పల్లి గ్రామానికి చెందిన ఉర్మా లక్ష్మి లకు తీవ్రంగా గాయాలయ్యాయి.
ప్రమాద సమాచారం అందుకున్న 108 సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చింతూరు ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తీసుకుని రావడం జరిగింది.సత్యనారాయణ వైద్యం పొందుతూ మృతి చెందాడు.తీవ్రంగా గాయాలైన లక్ష్మికి వైద్యం అందించి మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఏరియా వైద్యశాలకు రిఫర్ చేశారు.సత్యనారాయణ చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.ఈ ఘటన పై పోలీస్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




