Antarvedi: అంతర్వేది బీచ్, సాగర సంగమం వద్దకు సందర్శకుల నిషేధం!

Antarvedi: అర్నబ్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది బీచ్, సాగర సంగమం వద్దకు సందర్శకులు, భక్తుల ప్రవేశాన్ని నిషేధించారు.

PRABHU, RAZOLE
Published on: 26 Oct 2026 1:01 PM IST
Antarvedi
X

Antarvedi: అంతర్వేది బీచ్, సాగర సంగమం వద్దకు సందర్శకుల నిషేధం!

Antarvedi: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో అర్నబ్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అంతర్వేది బీచ్, సాగర సంగమం మరియు సముద్ర తీర ప్రాంతాలకు భక్తులు, సందర్శకుల ప్రవేశాన్ని నిషేధించినట్లు మెరైన్ సీఐ నవీన్ నరసింహమూర్తి తెలిపారు.

జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ ఆదేశాల మేరకు ఈ నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు బీచ్, సాగర సంగమం ప్రాంతాలకు ఎవరూ వెళ్లరాదని స్పష్టం చేశారు. భక్తులు, పర్యాటకులు పోలీసుల సూచనలను పాటిస్తూ అధికారులకు సహకరించాలని కోరారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE