Malikipuram: మలికిపురంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు

Malikipuram: మలికిపురంలోని ఏఎఫ్‌డీటీ కళాశాలలో ప్రిన్సిపాల్ రామరాజు ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, సదస్సు నిర్వహించారు.

PRABHU, RAZOLE
Published on: 17 Sept 2026 6:25 PM IST
Malikipuram
X

Malikipuram: మలికిపురంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు

మలికిపురం: శ్రమ, నైపుణ్యం, సృజనాత్మకతకు ప్రతీకగా భావించే శ్రీ విశ్వకర్మ భగవానుడి జయంతి వేడుకలను మలికిపురంలోని ఏఎఫ్డీటీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ రామరాజు ఆధ్వర్యంలో విశ్వకర్మ భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా విశ్వకర్మ భగవానుడి సేవలను, శ్రమకు ఇచ్చిన ప్రాధాన్యతను పలువురు గుర్తు చేసుకున్నారు. సమాజ అభివృద్ధిలో కార్మికులు, వృత్తి నిపుణులు, శిల్పులు, సాంకేతిక నిపుణుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. నైపుణ్యంతో పాటు సృజనాత్మకతను పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఏఎఫ్డీటీ కళాశాల అధ్యాపకులు, విద్యార్థి సంఘ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొని విశ్వకర్మ భగవానుడికి నివాళులు అర్పించారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE