Ravulapalem: ఈతకోట శ్రీ కనకదుర్గమ్మవారిని దర్శించుకున్న విక్టరీ వెంకటరెడ్డి!

Ravulapalem: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఈతకోట శ్రీ కనకదుర్గమ్మవారిని జన్మదినం సందర్భంగా దర్శించుకున్న విక్టరీ సంస్థల అధినేత గోలుగూరి వెంకటరెడ్డి.

TRIMURTULU, KOTHAPETA
Published on: 7 Nov 2026 9:36 AM IST
Ravulapalem
X

Ravulapalem: ఈతకోట శ్రీ కనకదుర్గమ్మవారిని దర్శించుకున్న విక్టరీ వెంకటరెడ్డి!

Ravulapalem: ఈతకోట గ్రామంలో జాతీయ రహదారి పక్కన కొత్త సెంటర్ వద్ద కొలువై ఉన్న శ్రీ శ్రీ కనకదుర్గమ్మవారిని శనివారం విక్టరీ సంస్థల అధినేత, రావులపాలెం గ్రామ మాజీ సర్పంచ్, సీఆర్సీ రూపకర్త గోలుగూరి వెంకటరెడ్డి (విక్టరీ) దర్శించుకున్నారు.

తన జన్మదినాన్ని పురస్కరించుకుని అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన ఆయన శ్రీ కనకదుర్గమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, దుర్గాదేవి.దుర్గామాత అమ్మవార్ల దివ్యదర్శనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ జనిపిరెడ్డి గోవిందరావు, కమిటీ సభ్యులు ఆయనకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వెంకటరెడ్డి గోత్ర నామాలతో ఆలయ అర్చకులు ఖండవిల్లి నారాయణాచార్యులు (నాని) ప్రత్యేక పూజలు నిర్వహించి, వేదమంత్రాల నడుమ ఆశీర్వచనాలు అందజేశారు.

ఈ సందర్భంగా గోలుగూరి వెంకటరెడ్డి (విక్టరీ) మాట్లాడుతూ, భక్తుల కోరికలను నెరవేర్చే శక్తిస్వరూపిణి శ్రీ కనకదుర్గమ్మవారి దివ్య ఆశీస్సులు ఈతకోట గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA