Rampachodavaram: సేవా సంకల్పానికి ఏడాది రంపలో వేదాగ్ని ట్రస్ట్ తొలి వార్షికోత్సవం!

Rampachodavaram: రంపచోడవరం మండలం రంప గ్రామంలో వేదాగ్ని ట్రస్ట్ తొలి వార్షికోత్సవ వేడుకలు.

Prasanna, Rampachodavaram
Published on: 13 Oct 2026 10:01 PM IST
Rampachodavaram
X

Rampachodavaram: సేవా సంకల్పానికి ఏడాది రంపలో వేదాగ్ని ట్రస్ట్ తొలి వార్షికోత్సవం!

రంపచోడవరం: పోలవరం జిల్లా, రంపచోడవరం మండలం, రంప గ్రామంలో వేదాగ్ని ట్రస్ట్ తొలి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేదాగ్ని ట్రస్ట్ అధినేత శ్రీ మంజు శ్రీనివాస్ గారు ముఖ్యఅతిథిగా హాజరై కేక్ కట్ చేసి వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజసేవే వేదాగ్ని ట్రస్ట్ ప్రధాన లక్ష్యమని గత ఏడాదికాలంగా గిరిజన ప్రాంతాల్లో ప్రజల సంక్షేమం కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. భవిష్యత్తులో కూడా విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, పేదల సంక్షేమం వంటి రంగాల్లో మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు చిన్నారులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేదాగ్ని ట్రస్ట్ తొలి వార్షికోత్సవ వేడుకలను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం అనంతరం పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

Prasanna, Rampachodavaram

Prasanna, Rampachodavaram