Vadapalli: గౌతమి నదీతీరాన వైభవంగా వాడపల్లి వెంకన్న తెప్పోత్సవం!

Vadapalli: కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా శనివారం గౌతమి నదీతీరాన తెప్పోత్సవం వైభవంగా జరిగింది.

TRIMURTULU, KOTHAPETA
Published on: 22 Nov 2026 2:14 PM IST
Vadapalli
X

Vadapalli: గౌతమి నదీతీరాన వైభవంగా వాడపల్లి వెంకన్న తెప్పోత్సవం!

Vadapalli: కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో క్షీరాబ్ది ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం గౌతమి నదీతీరాన శ్రీ స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.

వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి, సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై స్వామివారిని ఆశీనులను చేసి గౌతమి నదిలో తెప్పోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చక స్వాములు, భక్తులు, ఆలయ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA