Vadapalli: వాడపల్లి విశ్వేశ్వర స్వామివారికి కార్తిక సోమవారం విశేష అభిషేకాలు!
Vadapalli: కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి క్షేత్రంలోని శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో కార్తిక సోమవారం సందర్భంగా విశేష అభిషేకాలు నిర్వహించారు.
Vadapalli: వాడపల్లి విశ్వేశ్వర స్వామివారికి కార్తిక సోమవారం విశేష అభిషేకాలు!
వాడపల్లి: కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో కార్తిక సోమవారం పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.




