Undrajavaram: ఉండ్రాజవరం ప్రచారంలో దూసుకుపోతున్న కనకదుర్గ

Undrajavaram: నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం గ్రామ అభివృద్ధి కమిటీ సర్పంచి అభ్యర్థి బుడంపర్తి కనకదుర్గ విస్తృత ప్రచారం; అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి.

UJJINA BALARAMA KRISHNA, NIDADAVOLE
Published on: 27 Nov 2026 10:43 PM IST
Undrajavaram
X

Undrajavaram: ఉండ్రాజవరం ప్రచారంలో దూసుకుపోతున్న కనకదుర్గ

ఉండ్రాజవరం: ఉండ్రాజవరం మండల కేంద్రంలో తెదేపా, వైకాపా, జనసేన కలసి గ్రామ అభివృద్ధి కమిటీగా ఏర్పడి బలపరిచిన సర్పంచి అభ్యర్థి బుడంపర్తి కనకదుర్గ గ్రామంలో శుక్రవారం వార్డు సభ్యులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

గ్రామ అభివృద్ధి కమిటీ నాయకుల ఆశీస్సులతో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారంలో ఆమె దూసుకుపోతున్నారు. గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తే గతంలో ఎన్నడూ లేనివిధంగా గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని నాయకులు పేర్కొన్నారు. తమకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో రైతు అడ్వైజరి బోర్డు రెండో జోనల్ చైర్మన్ బూరుగుపల్లి సుబ్బారావు, తెదేపా సీనియర్ నాయకుడు కుదప చక్రపాణి, కుదప హేమంత్ నాగు, తెదేపా, వైకాపా, జనసేన నాయకులు పాల్గొన్నారు.

UJJINA BALARAMA KRISHNA, NIDADAVOLE

UJJINA BALARAMA KRISHNA, NIDADAVOLE