Undrajavaram: ఉండ్రాజవరంలో జోరందుకున్న కూటమి సర్పంచి అభ్యర్థి ప్రచారం

Undrajavaram: నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం కూటమి సర్పంచి అభ్యర్థి సిరిసపల్లి రాజేశ్వరి విస్తృత ప్రచారం; అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి.

UJJINA BALARAMA KRISHNA, NIDADAVOLE
Published on: 27 Nov 2026 10:46 PM IST
Undrajavaram
X

Undrajavaram: ఉండ్రాజవరంలో జోరందుకున్న కూటమి సర్పంచి అభ్యర్థి ప్రచారం

ఉండ్రాజవరం: నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం కూటమి సర్పంచి అభ్యర్థి శుక్రవారం గ్రామంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండల కేంద్రం ఉండ్రాజవరం సర్పంచ్ అభ్యర్థి బీసీ మహిళకు రిజర్వ్ అయింది. గ్రామంలో 11,500 మంది ఓటర్లు ఉండగా 16 వార్డులు ఉన్నాయి.

కూటమి నుంచి సర్పంచ్ అభ్యర్థిగా సిరిసపల్లి రాజేశ్వరిని బలపరిచారు. గ్రామ మాజీ సర్పంచి, తెదేపా సీనియర్ నాయకుడు గన్నమని వెంకటసుబ్బారావు ఆధ్వర్యంలో ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని జోరుగా చేస్తున్నారు. తాము బలపరిచిన సర్పంచి అభ్యర్ధి రాజేశ్వరికి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

UJJINA BALARAMA KRISHNA, NIDADAVOLE

UJJINA BALARAMA KRISHNA, NIDADAVOLE