Mamidikuduru: బి.దొడ్డవరం మధ్యలంకలో అటవీ శాఖ అధికారుల దాడులు!
Mamidikuduru: మామిడికుదురు మండలం బి.దొడ్డవరం మధ్యలంకలో విదేశీ పక్షులను వేటాడుతున్న ఇద్దరు వేటగాళ్లను అటవీ శాఖ అధికారులు అరెస్టు చేశారు.
Mamidikuduru: బి.దొడ్డవరం మధ్యలంకలో అటవీ శాఖ అధికారుల దాడులు!
Mamidikuduru: మామిడికుదురు మండలం బి.దొడ్డవరం గ్రామంలోని మధ్యలంకలో విడిది చేసిన విదేశీ పక్షులను వేటాడుతున్న ఇద్దరు వేటగాళ్లను అటవీ శాఖ అధికారులు గురువారం అరెస్టు చేశారు. స్థానికుడు కుడిపూడి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా ఫారెస్ట్ రేంజ్ అధికారి సత్యనారాయణ తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి ఇద్దరు వేటగాళ్లను అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ అధికారి సత్యనారాయణ మాట్లాడుతూ విదేశీ పక్షులను వేటాడటం చట్టరీత్యా నేరమని, వన్యప్రాణుల సంరక్షణకు విఘాతం కలిగించే చర్యలను ఏమాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు. పక్షుల వేటకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విదేశీ పక్షుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.




