Razole: సోంపల్లిలో కలకలం రేపిన భారీ త్రాచుపాముల సయ్యాట!

Razole: రాజోలు మండలం సోంపల్లి గ్రామంలో రెండు భారీ త్రాచుపాములు పడగవిప్పి సయ్యాట. స్థానికులు వీడియో తీయడంతో సోషల్ మీడియాలో వైరల్. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

PRABHU, RAZOLE
Published on: 29 Sept 2026 12:06 PM IST
Razole
X

Razole: సోంపల్లిలో కలకలం రేపిన భారీ త్రాచుపాముల సయ్యాట!

Razole: రాజోలు మండలం సోంపల్లి గ్రామంలో రెండు భారీ విషసర్పాలు (త్రాచుపాములు) సయ్యాట ఆడుతూ కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఒకదానితో ఒకటి చుట్టుకుంటూ, పడగలు విప్పి సయ్యాట ఆడుతున్న దృశ్యాలు స్థానికులను ఆకట్టుకున్నాయి.

ఈ దృశ్యాలను కొందరు స్థానికులు తమ సెల్‌ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారాయి. రెండు భారీ త్రాచుపాములు ఒకేచోట కనిపించడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. వాటికి దూరంగా ఉండాలని, పాములను రెచ్చగొట్టకుండా జాగ్రత్తగా ఉండాలని గ్రామస్తులు సూచించారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE