Tiruvuru: బెంచ్ ప్రెస్ పోటీల్లో హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్ క్రీడాకారుల విజయం

Tiruvuru: తిరువూరులో జరిగిన రాష్ట్రస్థాయి బెంచ్ ప్రెస్ పోటీల్లో కోనసీమ జిల్లాకు చెందిన వాకా గోపి, బి. అప్పన్న బంగారు పతకాలు సాధించి ఘన విజయం సాధించారు.

SURESH, AMALAPURAM
Published on: 6 Oct 2026 8:27 PM IST
Tiruvuru
X

Tiruvuru: బెంచ్ ప్రెస్ పోటీల్లో హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్ క్రీడాకారుల విజయం

తిరువూరు: ఈనెల తిరువూరులో జరిగిన 13వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి బెంచ్ ప్రెస్ పోటీల్లో డాక్టర్ కోనసీమ జిల్లా నుండి హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్ క్రీడాకారులు మాస్టర్స్ క్యాటగిల్లో 83 కేజీలు విభాగంలో వాకా గోపి 105 కేజీల బరువు ఎత్తి 120 కేజీ ల భాగంలో బి.అప్పన్న 125 కేజీల బరువు ఎత్తి బంగారు పతకాలను సాధించారు.

విజేతలు ఇద్దరికీ మరియు జిల్లా టీమ్ కోచ్ ఎం.వి.సముద్రం కు ఈరోజు హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్ లో ఘనంగా సత్కరించి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.క్రీడా విజయాల వల్ల మానసిక ఆనందంతోపాటు తమ లక్ష్యాన్ని నెరవేర్చుకున్నామని ఆనందాన్ని పొందవచ్చునని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఎనమదుల బుజ్జి,మేకల కిషోర్,మోరం బుజ్జి, శోభన్ బాబు,డాక్టర్ నాగేశ్వర రావు,కర్రీ ప్రసాద్ మరియు హెల్త్ అండ్ ఫిట్నెస్ మెంబర్స్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారని కోవచ్చు కంకిపాటి వెంకటేశ్వర రావు అన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM