Razole: రాజోలు మండలం తాటిపాకలో ముగ్గురు చిన్నారుల అదృశ్యం!
Razole: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాకలో ముగ్గురు చిన్నారులు అదృశ్యమవడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Razole: రాజోలు మండలం తాటిపాకలో ముగ్గురు చిన్నారుల అదృశ్యం!
Razole: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాకలో ముగ్గురు చిన్నారులు అదృశ్యమవడంతో కలకలం రేగింది. ఆరవ తరగతి విద్యార్థి ముస్కూడి కార్తీక్‌తో పాటు ఏడేళ్ల ముత్యాల సాయిరాం, ఐదేళ్ల ముత్యాల అంజి ప్రభు కలిసి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు.
చిన్నారులు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వారి ఆచూకీ కోసం వివిధ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న రాజోలు ఎస్సై మల్లికార్జున్ రెడ్డి మూడు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి చిన్నారుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.
చిన్నారులు ఎక్కడికి వెళ్లారు, ఎవరితో ఉన్నారు అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమ పిల్లల ఆచూకీ కోసం తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చిన్నారుల సమాచారం తెలిసిన వారు వెంటనే పోలీసులకు తెలియజేయాలని అధికారులు కోరుతున్నారు.




