Vadapalli: కోరికలు తీర్చే కొంగుబంగారం వాడపల్లి వెంకన్న!

Vadapalli: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు శనివారం భక్తులు పోటెత్తారు.

TRIMURTULU, KOTHAPETA
Published on: 3 Oct 2026 10:06 AM IST
Vadapalli
X

Vadapalli: కోరికలు తీర్చే కొంగుబంగారం వాడపల్లి వెంకన్న!

Vadapalli: కోనసీమ తిరుపతిగా విరాజిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి శనివారం రోజు వేల సంఖ్యలో భక్తులు వాడవీధులన్నీ కిటకిటలాడుతున్నాయి. స్వామికి వేకువ జామునే సుప్రభాత సేవ తొలి హారతి నుండి భక్తులు దర్శనాలు ప్రారంభమవుతాయి.

ఏడు వారాలు వెంకన్న స్వామిగా వరాలు ఇచ్చే స్వామిగా కొలిచే భక్తులు తెల్లవారుజాము నుండి మాడవీధులలో ప్రదక్షణలు ప్రారంభించి దేవాలయం చుట్టూ ఏడు ప్రదక్షణలు చేసి స్వామి దర్శనానికి వెళ్తారు.

కొత్తపేట నియోజకవర్గంలోని ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభు గా విరాజిల్లుతూ ఎంతోమందికి కోరికలు తీర్చే స్వామిగా పేరు పొందారు.

వాడపల్లి స్వామి దర్శనానికి ఆంధ్ర తెలంగాణ కాకుండా బెంగళూరు తమిళనాడు కేరళ దక్షిణాది రాష్ట్రాల నుండి ప్రతి వారము రావటం మొదలయింది.

ఈ స్వామికి నెలకు రెండు కోట్ల పైబడి ఆదాయం రావడంతో సౌకర్యాలు కూడా అంతే విధంగా కొనసాగుతున్నాయి. ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు. ఆలయ చైర్మన్ ఎం గబ్బర్ సింగ్ ప్రతి శనివారం తో పాటు ఇతరు రోజుల్లోనూ భక్తులు పెరగటంతో ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటున్నారు.

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA