Razole: డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ జరిపించాలి తెన్నేటి కిషోర్!

Razole: రాజోలులో వైఎస్సార్‌సీపీ నేత తెన్నేటి కిషోర్ డిమాండ్. డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ జరిపించాలని, లేదంటే మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని స్పష్టీకరణ.

PRABHU, RAZOLE
Published on: 23 Sept 2026 12:36 PM IST
Razole
X

Razole: డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ జరిపించాలి తెన్నేటి కిషోర్!

Razole: రాష్ట్రంలోని విద్యార్థులు, నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా పోరాటం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడటం అప్రజాస్వామికమని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తెన్నేటి కిషోర్ అన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం అధికార పార్టీ నైజాన్ని ప్రతిబింబిస్తోందని విమర్శించారు.

రాజోలులో కిషోర్ మాట్లాడుతూ.. డీఎస్సీ నియామకాల్లో అవకతవకలపై సమగ్ర సీబీఐ విచారణ జరిపించి, కష్టపడి చదివిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నియామకాలు పారదర్శకంగా జరిగాయని ప్రభుత్వం భావిస్తే సీబీఐ విచారణకు సిద్ధం కావాలని, తప్పులు జరిగినట్లు తేలితే మంత్రి నారా లోకేష్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని కిషోర్ డిమాండ్ చేశారు.

ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయించడం, పోలీసులను అడ్డుపెట్టుకుని తప్పుడు కేసులు నమోదు చేయడం ద్వారా ప్రజా ఉద్యమాలను అడ్డుకోలేరని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వైసీపీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ప్రజలు అన్ని పరిణామాలను గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలే తగిన సమాధానం చెబుతారని తెన్నేటి కిషోర్ హెచ్చరించారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE