Allavaram: వైసీపీ హయాంలోనే అల్లవరం తీరంలో ఇసుక దోపిడీ: సత్తిబాబు రాజు!
Allavaram: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలో ఇసుక దోపిడీపై టీడీపీ నేత సత్తిబాబు రాజు విమర్శలు. వైసీపీ హయాంలోనే ఇసుక అక్రమ రవాణా జరిగిందని స్పష్టీకరణ.
Allavaram: వైసీపీ హయాంలోనే అల్లవరం తీరంలో ఇసుక దోపిడీ: సత్తిబాబు రాజు!
Allavaram: అల్లవరంలో తీర ప్రాంతంలో ఇసుక దోపిడీ వైసీపీ ప్రభుత్వంలో అత్యంత దారుణంగా జరిగిందని,అయితే ఇప్పుడు రైతులే ఇసుకను అమ్ముకుంటుంటే కూటమి ప్రభుత్వంపై బుదర జల్లడం సరైంది కాదని అల్లవరం మండల టీడీపీ అధ్యక్షుడు,రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ దెందుకూరి సత్తిబాబు రాజు మండిపడ్డారు.ఇటీవల మైన్స్ అధికారులు అల్లవరం మండలం కొమరగిరిపట్నం తీర ప్రాంతం నుంచి ఇసుకను తరలిస్తున్న ఇసుక లారీలను సీజ్ చేసిన క్రమంలో ఓ వైసీపీ నాయకుడు కూటమి ప్రభుత్వం మీద పలు ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక తీర ప్రాంతం నుంచి ఇసుక తవ్వకాలు చాలా వరకు నియంత్రిచడం జరిగిందని, అయితే జిరాయితీ భూముల్లోని కొంత మంది రైతులు ఈ ఇసుకను అమ్ముకుంటున్నారన్నారు. దీనికి కూటమి నాయకులకు ఎటువంటి సంబంధం లేదన్నారు సత్తిబాబు రాజు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఇసుకను దారుణంగా అమ్ముకున్నారని,ఇసుక తవ్వకాల గురించి కూటమి నాయకుల వద్దకు ఎవ్వరైనా రైతులు వస్తే మైన్స్ శాఖ పర్మిషన్లు తీసుకుని,దానికి చెల్లించాల్సిన చలానాలు కట్టుకుని చట్టబద్ధంగా అమ్ముకోవాలని సూచిస్తున్నాము తప్ప అక్రమ కార్యకలాపాలకు తావిచ్చేది లేదన్నారు.
ఇసుక అక్రమ తవ్వకాలు,రవాణాకు మీ ప్రభుత్వంలో మీ పార్టీ పెద్దలే పూర్తిగా సహకరించారని,ప్రస్తుతం జరుగుతోన్న ఇసుక తరలింపులకు మా పార్టీకు ఎటువంటి సంబంధం లేదన్నారు. తీర ప్రాంత రక్షణకు కూటమి ప్రభుత్వం కృషిచేస్తోందని,ఈ క్రమంలోనే ఓడలరేవులో రక్షణ గోడ నిర్మాణం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అల్లవరం మండల టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షులు పశ్చిమాల ఏడుకొండలు,ఓడలరేవు టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షులుకొల్లు విష్ణుమూర్తి,నాతి వెన్నెల లెనిన్ బాబు(మాజీ ఎంపీటీసీ)తదితరులు పాల్గొన్నారు.




