Razole: సుజయ్ కృష్ణ రంగారావును కలిసిన అమూల్య!

Razole: రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావును టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గొల్లపల్లి అమూల్య మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు.

PRABHU, RAZOLE
Published on: 1 Oct 2026 7:26 AM IST
Razole
X

Razole: సుజయ్ కృష్ణ రంగారావును కలిసిన అమూల్య!

Razole: టీడీపీ జోన్–2 ఇన్‌చార్జ్, రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావును టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాజోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ గొల్లపల్లి అమూల్య మర్యాదపూర్వకంగా కలిశారు. పి.గన్నవరం నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన సుజయ్ కృష్ణ రంగారావును పి.గన్నవరం టీడీపీ కార్యాలయంలో అమూల్య కలిసి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు.

అనంతరం నూతనంగా పి.గన్నవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా నియమితులైన మోకా ఆనంద్ సాగర్‌ను కూడా అమూల్య సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజోలు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు, కార్యకర్తల సమన్వయం తదితర అంశాలను సుజయ్ కృష్ణ రంగారావుకు వివరించారు.

రాజోలులో అమూల్య ఆధ్వర్యంలో కొనసాగుతున్న పార్టీ కార్యక్రమాలపై సుజయ్ కృష్ణ రంగారావు సంతృప్తి వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించినట్లు పేర్కొన్నాయి.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE