Rajanagaram: వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ సర్పంచ్ బండి హరిబాబు!
Rajanagaram: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సమక్షంలో వైసీపీలో చేరిన సీనియర్ నేత బండి హరిబాబు.
Rajanagaram: వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ సర్పంచ్ బండి హరిబాబు!
Rajanagaram: తూర్పుగోదావరిజిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న రాజానగరం నియోజకవర్గంలో టిడిపికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీతానగరం మండలం మునికూడలి గ్రామానికి చెందిన సీనియర్ టిడిపి నేత, మాజీ సర్పంచ్ బండి హరిబాబు బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సమక్షంలో హరిబాబు తన 100 మంది అనుచరులతో కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు ఇదే కోవలో టిడిపిలో బలమైన సామాజిక వర్గం నుండి వైసీపీ కండువా కప్పుకోవడానికి ప్రధాన నేతలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.




