Adurru: ఆదుర్రులో ఓటు వేసిన జడ్పీటీసీ అభ్యర్థి గొల్లపల్లి అమూల్య

Adurru: మామిడికుదురు మండలం ఆదుర్రు గ్రామంలో కూటమి టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి గొల్లపల్లి అమూల్య ఓటు హక్కు వినియోగించుకుని ప్రజలకు పిలుపునిచ్చారు.

PRABHU, RAZOLE
Published on: 5 Nov 2026 2:32 PM IST
Adurru
X

Adurru: ఆదుర్రులో ఓటు వేసిన జడ్పీటీసీ అభ్యర్థి గొల్లపల్లి అమూల్య

ఆదుర్రు: మామిడికుదురు మండలం ఆదుర్రు గ్రామంలో స్థానిక ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి గొల్లపల్లి అమూల్య తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రంలో ఎన్నికల అధికారులు చేపట్టిన ఏర్పాట్లపై ఆమె ఆరా తీశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అత్యంత విలువైనదని, ప్రతి పౌరుడు తన ఓటు హక్కును బాధ్యతగా భావించి ఎన్నికల ప్రక్రియలో భాగస్వామి కావాలని ఆమె సూచించారు.

ఎలాంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లొంగకుండా స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత, మహిళలు, వృద్ధులు ఎన్నికల ప్రాధాన్యతను గుర్తించి పోలింగ్‌లో చురుగ్గా పాల్గొనాలని కోరారు.

ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో ఓటర్ల భాగస్వామ్యం కీలకమని గొల్లపల్లి అమూల్య పేర్కొన్నారు.

ఆదుర్రు : మామిడికుదురు మండలం ఆదుర్రు గ్రామంలో స్థానిక ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి గొల్లపల్లి అమూల్య తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.