Amalapuram: తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో 'స్వచ్ఛ అమలాపురం'
Amalapuram: 3,600 మంది విద్యార్థుల భాగస్వామ్యంతో చేపట్టిన ‘స్వచ్ఛ అమలాపురం’ కార్యక్రమం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నిలిచింది. కిమ్స్ చైర్మన్ చైతన్య రాజు అవార్డు అందుకున్నారు.
Amalapuram: తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో 'స్వచ్ఛ అమలాపురం'
Amalapuram: అందాల అమలాపురాన్ని పరిశుభ్రంగా,పచ్చదనంతో నిండిన పట్టణంగా తీర్చిదిద్ది భావితరాలకు అందించాలనే లక్ష్యంతో కిమ్స్ మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ అమలాపురం కార్యక్రమం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.కిమ్స్ మెడికల్ కళాశాల చైర్మన్ చైతన్య రాజు నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 3,600 మంది విద్యార్థులు పాల్గొనగా,ఈ ఘనతకు గుర్తింపుగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు చైతన్య రాజుకు అవార్డును అందజేశారు.
“మనం అమలాపురం మన బాధ్యత” అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పాల్గొన్నారు.కిమ్స్ మెడికల్ కళాశాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు ఫ్లకార్డులు చేతబూని పట్టణ పురవీధుల్లో పర్యటిస్తూ పరిసరాలను శుభ్రం చేశారు. పట్టణ పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ,స్వచ్ఛ అమలాపురం సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ
అమలాపురాన్ని పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పిలుపునిచ్చారు.విద్యార్థులు పెద్ద సంఖ్యలో స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయమని పేర్కొన్నారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని,ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో సామాజిక బాధ్యత పెరుగుతుందని అన్నారు. అమలాపురం పచ్చదనాన్ని, సహజ సౌందర్యాన్ని కాపాడుకుంటూ భావితరాలకు అందమైన పట్టణాన్ని అందించాలని ఆకాంక్షించారు.
కిమ్స్ చైర్మన్ చైతన్య రాజు మాట్లాడుతూ స్వచ్ఛ అమలాపురం లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమంలో 3,600 మంది విద్యార్థులు భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని కిమ్స్ చైర్మన్ చైతన్య రాజు పేర్కొన్నారు.
పరిశుభ్రత అనేది ఒకరోజు కార్యక్రమానికి మాత్రమే పరిమితం కాకుండా ప్రతి ఒక్కరి జీవన విధానంలో భాగం కావాలని అన్నారు. పట్టణ ప్రజలను భాగస్వాములుగా చేస్తూ అమలాపురాన్ని పరిశుభ్రంగా,పచ్చదనంతో నిండిన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.వేలాది మంది విద్యార్థుల భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించడం విశేషంగా నిలిచింది.
ఈ గుర్తింపుకు సంబంధించి సంస్థ ప్రతినిధులు కిమ్స్ చైర్మన్ చైతన్య రాజుకు అవార్డు అందజేయడంతో కార్యక్రమంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించం అని చైతన్య రాజు అన్నారు.ఈ కార్యక్రమం కూటమి కార్యకర్తలు, నాయకులు,తదితరులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.




