Kadiyam: పంచాయతీ ఎన్నికల మెటీరియల్ పంపిణీని పరిశీలించిన సబ్ కలెక్టర్!
Kadiyam: రాజమండ్రి రూరల్ కడియం మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల మెటీరియల్ పంపిణీ ప్రక్రియను సబ్ కలెక్టర్ శుభం నోక్వాల్ పరిశీలించారు.
Kadiyam: పంచాయతీ ఎన్నికల మెటీరియల్ పంపిణీని పరిశీలించిన సబ్ కలెక్టర్!
Kadiyam: కడియం మండలం లోని గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మెటీరియల్ పంపిణీ కార్యక్రమం కడియం హైస్కూల్ గ్రౌండ్లో ఏర్పాట్లలో ప్రక్రియను సబ్ కలెక్టర్ శుభం నోక్వాల్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కడియం, కడియపులంక గ్రామ పంచాయతీ కార్యాలయాలను సందర్శించి సర్పంచ్, వార్డు సభ్యుల ఎలక్షన్ ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఎలక్షన్ కు సంబంధించి అధికారులు చేపట్టిన ఏర్పాట్లు, నిర్వహణ తదితర అంశాలను పరిశీలించి తగిన సూచనలు చేశారు.
ఎలక్షన్ ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా నిర్వహించాలని సబ్ కలెక్టర్ అధికారులకు సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తూ, ఎలక్షన్ ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట స్పెషల్ ఆఫీసర్ NVSN మూర్తి కడియం తహసీల్దార్, ఎం.శ్రీనివాస్, ఎంపీడీవో రమేష్ తదితరులు ఉన్నారు.




