Rajamahendravaram: రాజమండ్రిలో కళాకారులు, సంఘ సేవకులకు ఘన సత్కారం!
Rajamahendravaram: రాజమండ్రిలో అక్టోబర్ 6న శోభిత వర్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో కళాకారులు, సంఘసేవకులకు ఘన సత్కారం. వివరాలకు స్థానిక నిర్వాహకులను సంప్రదించండి.
Rajamahendravaram: రాజమండ్రిలో కళాకారులు, సంఘ సేవకులకు ఘన సత్కారం!
Rajamahendravaram: సమాజ శ్రేయస్సుకు పాటుపడే సంఘ సేవకులను కళాకారులను సత్కరించు కోవడం మహాభాగ్య మని శోభిత వర్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ చల్లగాలి శ్రీనివాస్ వర్మ అన్నారు.
తన కుమారుని పేరిట నెలకొల్పిన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 17 నెలలుగా ప్రతినెలా ముగ్గురు కళాకారు లను, ముగ్గురు సంఘ సేవకులను సత్కరిస్తూ వస్తున్నామని తెలిపారు.
దానిలో భాగంగా అక్టోబర్ 6 వ తేదీన కె. రమాలలిత, షేక్ మాయా మస్తాన్, పోలిక గంగాధర దుర్గ పల్లం రాజు, నీలి అశోక్ కుమార్,నాలం ఆండాళ్, ఉప్పులూరి దేవి ప్రసన్న లను ఘనంగా సత్కరించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా భారతీయ చైతన్య పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కట్టా కృష్ణ ఏ పీ ఐ ఎఫ్ డబ్ల్యూ జె రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎస్. లోకనాధం కె.వి.యం క్లినిక్ వైద్యులు కె.నాగేంద్ర ప్రసాదరావు పాల్గొంటారన్నారు. రాష్ట్రంలోని కళాకారులు సంఘ సేవకులు ప్రతినెల సత్కారం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు నని డాక్టర్ వర్మ కళ్యాణి దంపతులు తెలిపారు.




