Konaseema: కోనసీమలో నిలిచిన విద్యుత్ సరఫరా!

Konaseema: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలంలో వరుస తుఫాన్ల ధాటికి స్తంభించిన విద్యుత్ సరఫరా.

PRABHU, RAZOLE
Published on: 4 Nov 2026 12:51 PM IST
Konaseema
X

Konaseema: కోనసీమలో నిలిచిన విద్యుత్ సరఫరా!

Konaseema: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వరుసగా అర్నబ్, మురసు తుఫాన్ల ప్రభావంతో పలు గ్రామాలు ఇంకా అంధకారంలోనే ఉన్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లిలోని సంజీవయ్య కాలనీలో విద్యుత్ లేక ప్రజలు సెల్‌ఫోన్లు ఛార్జింగ్ చేసుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. కాలనీలో జనరేటర్ సౌకర్యం ఉన్న ఒక ఇంటి వద్దకు చేరుకుని తమ మొబైల్ ఫోన్లను ఛార్జింగ్ చేసుకుంటున్నారు.

వరుస తుఫాన్ల కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో నిత్యావసర పనులతో పాటు సమాచార మార్పిడికి కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE