Sakinetipalli: పాఠశాలకు రూ.21 వేల విలువైన పవర్ ఇన్వర్టర్ అందజేత
Sakinetipalli: సఖినేటిపల్లి లంక పాఠశాలకు విద్యార్థుల సౌలభ్యం కోసం మాజీ సర్పంచ్ రేపూరి రాజేశ్వరి ఏసు నరసింహ రాజా రూ. 21 వేల విలువైన పవర్ ఇన్వర్టర్ అందజేశారు.
Sakinetipalli: పాఠశాలకు రూ.21 వేల విలువైన పవర్ ఇన్వర్టర్ అందజేత
సఖినేటిపల్లి: సఖినేటిపల్లి లంక బస్వా వారి సెంటర్‌లోని MPPP మెయిన్ పాఠశాలకు పూర్వ విద్యార్థి, మాజీ సర్పంచ్ రేపూరి రాజేశ్వరి ఏసు నరసింహ రాజా రూ.21 వేల విలువైన పవర్ ఇన్వర్టర్‌ను అందజేశారు.
విద్యుత్ అంతరాయాల సమయంలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఇన్వర్టర్‌ను అందించడం పట్ల ఉపాధ్యాయులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. పాఠశాల అభివృద్ధికి సహకరించిన రేపూరి రాజేశ్వరి ఏసు నరసింహ రాజాకు పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఇన్వర్టర్‌ను SMC చైర్మన్ ముచ్చర్ల వెంకటేష్, ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. కార్యక్రమంలో AMC డైరెక్టర్ గునిశెట్టి రాంబాబు (రామ్ జి), గ్రామశాఖ అధ్యక్షులు రేపూరి శ్రీనివాసు, పట్టపు సూర్యప్రకాశ్ రావు తదితరులు పాల్గొన్నారు.




