Sakhinetipallilanka: డబ్బు పంచం.. ప్రలోభాలకు లొంగం.. దేవుడి సాక్షిగా అభ్యర్థుల ప్రమాణం!

Sakhinetipallilanka: కోనసీమ జిల్లా సఖినేటిపల్లిలంక సర్పంచ్ అభ్యర్థులు రేపూరి వాసు, చల్లా నాగరాజు ఎన్నికల్లో డబ్బు పంచబోమని ఆదివారం రామాలయంలో దేవుడి సాక్షిగా ప్రమాణం చేశారు.

PRABHU, RAZOLE
Published on: 22 Nov 2026 3:10 PM IST
Sakhinetipallilanka
X

Sakhinetipallilanka: డబ్బు పంచం.. ప్రలోభాలకు లొంగం.. దేవుడి సాక్షిగా అభ్యర్థుల ప్రమాణం!

సఖినేటిపల్లిలంక: ఎన్నికలంటేనే డబ్బు పంపిణీ, ప్రలోభాలు, హామీలతో ఓటర్లను ఆకట్టుకునే పరిస్థితులు కనిపిస్తున్న ప్రస్తుత తరుణంలో సఖినేటిపల్లిలంక గ్రామంలో ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు.

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లిలంక గ్రామానికి చెందిన సర్పంచ్ అభ్యర్థులు రేపూరి వాసు, చల్లా నాగరాజు స్థానిక రామాలయానికి వెళ్లి స్వామివారి సాక్షిగా ప్రమాణం చేశారు.

ఎన్నికల్లో ఓటర్లకు నగదు పంపిణీ చేయబోమని, ఎలాంటి ప్రలోభాలకు గురిచేసి ఓట్లు అడగబోమని స్పష్టం చేశారు. ప్రజలను చైతన్యపరుస్తూ, తమ ఆలోచనలు, సేవా దృక్పథం, గ్రామాభివృద్ధి లక్ష్యాలను వివరించి ఓట్లు కోరుతామని ప్రతిజ్ఞ చేశారు.

నిస్వార్థంగా, నిజాయితీగా ప్రజల మద్దతు పొందడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఎన్నికల్లో డబ్బు, ప్రలోభాల సంస్కృతికి స్వస్తి పలికి ప్రజాస్వామ్య విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలనే సందేశంతో వీరు చేసిన ఈ ప్రమాణం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE