Sakhinetipalli: గోదావరిలో గుర్తు తెలియని మగ మృతదేహం లభ్యం!
Sakhinetipalli: సఖినేటిపల్లి బోను సెంటర్ వద్ద గోదావరి నదిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం. కేసు నమోదు చేసిన పోలీసులు. సమాచారం ఉంటే తెలపాలని ఎస్సై కోరిక.
Sakhinetipalli: గోదావరిలో గుర్తు తెలియని మగ మృతదేహం లభ్యం!
Sakhinetipalli: సఖినేటిపల్లి మండలం బోను సెంటర్ వద్ద గోదావరి నదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడి వయస్సు సుమారు 40 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండవచ్చని, ఎత్తు సుమారు 5.8 అడుగులు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. మృతదేహంపై ఎలాంటి దుస్తులు లేవని తెలిపారు.
ఈ ఘటనపై నిన్న ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సఖినేటిపల్లి ఎస్సై హరికోటి శాస్త్రి వెల్లడించారు. మృతుడిని గుర్తించే వారు లేదా ఆయనకు సంబంధించిన సమాచారం తెలిసిన వారు సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ఎస్సై కోరారు.




