Sakhinetipalli: గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం.. రాత్రివేళల్లో ప్రత్యేక తనిఖీలు!
Sakhinetipalli: సఖినేటిపల్లిలో గంజాయి వినియోగంపై పోలీసుల ఉక్కుపాదం. రాత్రివేళల్లో ప్రత్యేక తనిఖీలు, కౌన్సెలింగ్, బైండోవర్ చర్యలు. రంగంలోకి ఈగల్ టీమ్ నిఘా.
Sakhinetipalli: గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం.. రాత్రివేళల్లో ప్రత్యేక తనిఖీలు!
Sakhinetipalli: సఖినేటిపల్లి మండలంలో గంజాయి వినియోగాన్ని అరికట్టేందుకు సఖినేటిపల్లి పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గంజాయి వినియోగిస్తున్నట్లు గుర్తించిన వారికి పోలీస్ స్టేషన్‌లో కౌన్సెలింగ్ నిర్వహిస్తూ, చట్టపరంగా బైండోవర్ చర్యలు తీసుకుంటున్నారు. గంజాయి వినియోగం జరుగుతున్నట్లు సమాచారం అందిన ప్రాంతాల్లో పగలు, రాత్రి వేళల్లోనూ తనిఖీలు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో మత్తు పదార్థాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు ఈగల్ టీమ్ కూడా పనిచేస్తోంది. గంజాయి సంబంధిత కార్యకలాపాలపై నిఘా కొనసాగిస్తున్నట్లు సమాచారం.
మండల పరిధిలో గంజాయి విక్రయాలు, వినియోగం జరిగినట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్‌ఐ హరికోటి శాస్త్రి కోరారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి రహిత సమాజ నిర్మాణానికి ప్రజలు సహకరించాలని ఆయన సూచించారు.




