Rajahmundry: వినాయక నిమజ్జనాలలో జాగ్రత్తలు తప్పనిసరి: కమిషనర్
Rajahmundry: రాజమండ్రి కార్పొరేషన్‌లో శ్రీ లక్ష్మీ గణపతి నిమజ్జనోత్సవం ఘనంగా జరిగింది. నిమజ్జనాలలో భద్రతా జాగ్రత్తలు పాటించాలని కమిషనర్ రాహుల్ మీనా కోరారు.
Rajahmundry: వినాయక నిమజ్జనాలలో జాగ్రత్తలు తప్పనిసరి: కమిషనర్
రాజమండ్రి: వినాయక నిమజ్జనాలలో భక్తులు తగు జాగ్రత్తలు పాటించాలని కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో ఉద్యోగులు ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ గణపతి వినాయక నిమజ్జన కార్యక్రమం శనివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. చవితి ఉత్సవాల ముగింపు పురస్కరించుకుని మధ్యాహ్నం భారీ అన్నసమారాధన, లడ్డూ వేలం నిర్వహించారు.
ఉత్సవమూర్తిని మంగళవాయిద్యాలు, కోలాటాల నడుమ ఊరేగించారు. ఈ సందర్భంగా చిన్నారుల కర్రసాము ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. నిమజ్జన కార్యక్రమాలకు చిన్న పిల్లలను దూరంగా ఉంచాలని, యువత జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఊరేగింపు మార్గంలో విద్యుత్ లైన్లపై జాగ్రత్త వహించాలని, ట్రాఫిక్ అంతరాయం కలిగించకుండా క్రమపద్ధతిలో ఒకేవైపు ఊరేగింపు కొనసాగాలన్నారు.
డీజేలను పరిమితికి మించిన శబ్దంతో వినియోగించరాదన్నారు. గజ ఈతగాళ్లు, క్రేన్ల సహాయంతో మాత్రమే నిమజ్జనం చేయించాలని.. అనుమతుల్లేని ప్రదేశంలో నిమజ్జనం చేయరాదని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో రెవెన్యూ అధికారి సీహెచ్ శ్రీనివాసరావు, ఉత్సవ కమిటీ సభ్యులు కె.ఎ.పి. మూర్తి, పి.వి.బి. రమణారావు, ఎం.వీరబాబు, కె.షరీన్, ఎస్.ఎన్.బి.శాస్త్రి, ఎ. శ్రీనివాస్, కె.వీర్రాజు, లోవరాజు, కృష్ణారావు, శ్రీగిరి, మణికంఠ, రవి లక్ష్మణ్, శివ నారాయణ, ఫణింద్ర, సాయికుమార్, రాజ్ కుమార్, సత్యనారాయణ, నాగేశ్వరరావు, ఎం.వి.నారాయణ, సత్తిరాజు, కృష్ణ, ఇతర అధికారులు, సిబ్బంది, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.




