Razole: ప్రభుత్వ సన్నబియ్యం విక్రయాల్లో నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు!

Razole: ప్రభుత్వ సన్నబియ్యం విక్రయాల్లో నిబంధనలు ఉల్లంఘించి తాటిపాక ప్రైవేటు మిల్లు వద్ద అమ్ముతున్నారంటూ రాజోలు తహసీల్దార్‌కు దళిత సంఘాల జేఏసీ ఫిర్యాదు చేసింది.

PRABHU, RAZOLE
Published on: 17 Nov 2026 7:46 PM IST
Razole
X

Razole: ప్రభుత్వ సన్నబియ్యం విక్రయాల్లో నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు!

రాజోలు: ప్రభుత్వం ప్రజలకు తక్కువ ధరలకు అందిస్తున్న సన్నబియ్యం విక్రయాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాజోలు నియోజకవర్గ దళిత సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాజోలు తహసీల్దార్ కార్యాలయం వద్ద జరగాల్సిన సన్నబియ్యం విక్రయాలను నిలిపివేసి, తాటిపాకలోని ఓ ప్రైవేటు మిల్లు వద్ద విక్రయాలు చేపడుతున్నట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు. ఈ విషయంపై రాజోలు మండల ఎంఎస్వో, జిల్లా డీఎస్వోలకు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు లేకపోవడంతో మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో లిఖితపూర్వక వినతిపత్రం అందజేశారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో పారదర్శకత తప్పనిసరని, పేదలకు అందాల్సిన బియ్యం విక్రయాల్లో ఎలాంటి అక్రమాలకు తావుండకూడదని నాయకులు స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై జిల్లా జాయింట్ కలెక్టర్ సమగ్ర విచారణకు ఆదేశించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు సన్నబియ్యం విక్రయాలను రాజోలు తహసీల్దార్ కార్యాలయం వద్దే నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో దేవ రాజేంద్రప్రసాద్, బత్తుల మురళీకృష్ణ, చిలకపాటి శ్రీధర్, తోటే ప్రతాప్, బత్తుల రాజేష్, కాకర విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE