Gokavaram: గోకవరం మండలం కామరాజుపేటలో ఘోర రోడ్డు ప్రమాదం!
Gokavaram: తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కామరాజుపేటలో ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొని యువకుడు మృతి.. విషాదంలో జగ్గంపేట కుటుంబం.
Gokavaram: గోకవరం మండలం కామరాజుపేటలో ఘోర రోడ్డు ప్రమాదం!
Gokavaram: తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కామరాజుపేట గ్రామ పరిధిలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో జగ్గంపేట గ్రామానికి చెందిన వాసంశెట్టి ఆనంద్ (20) మృతి చెందాడు.
స్థానికుల వివరాల ప్రకారం.. ఆనంద్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కామరాజుపేట గ్రామ పరిధిలో ఆర్టీసీ బస్సుతో ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆనంద్ అక్కడికక్కడేమృతిచెందినట్లుస్థానికులు తెలిపారు. ప్రమాదంతో కొద్దిసేపు రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులుప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై వివరాలు సేకరించారు. మృతదేహాన్ని తదుపరి చర్యల కోసం తరలించినట్లు సమాచారం. ఈ ఘటనపై స్థానిక ఎస్ఐ పవన్ కుమార్ కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.




