Razole: రాజోలు ఎస్సీ బాలుర వసతి గృహానికి రూ.3 కోట్లు మంజూరు: ఎమ్మెల్యే

Razole: రాజోలు ఎస్సీ బాలుర ప్రభుత్వ వసతి గృహం నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.3 కోట్లు మంజూరు చేస్తూ జీవో 211 జారీ చేసిందని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు.

PRABHU, RAZOLE
Published on: 12 Oct 2026 7:53 PM IST
Razole
X

Razole: రాజోలు ఎస్సీ బాలుర వసతి గృహానికి రూ.3 కోట్లు మంజూరు: ఎమ్మెల్యే

రాజోలు: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలులోని ఎస్సీ బాలుర ప్రభుత్వ వసతి గృహం నూతన భవన నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.3 కోట్లు మంజూరు చేసినట్లు రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో నంబర్ 211 ద్వారా నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని వెల్లడించారు.

రాజోలులోని ఎస్సీ బాలుర వసతి గృహం పాత భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో దానిని తొలగించి, సుమారు ఏడాదిన్నర క్రితం నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అయితే కొన్ని కారణాల వల్ల నిర్మాణ ప్రక్రియలో జాప్యం జరిగిందని పేర్కొన్నారు.

తాజాగా ప్రభుత్వం రూ.3 కోట్ల నిధులు మంజూరు చేస్తూ జీవో జారీ చేయడంతో నూతన భవన నిర్మాణానికి మార్గం సుగమమైందని తెలిపారు. ఈ భవనం అందుబాటులోకి వస్తే వసతి గృహంలో ఉంటూ విద్యనభ్యసించే ఎస్సీ విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు లభించనున్నాయి. నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE