Rajole: పైడిదాసు వెన్నెముక చికిత్సకు రూ.2.02 లక్షల సీఎంఆర్‌ఎఫ్ ఎల్‌ఓసీ మంజూరు!
Rajole: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో వెన్నెముక వ్యాధితో బాధపడుతున్న నల్లి పైడిదాసుకు CMRF ద్వారా రూ.2,02,754 LOC మంజూరు.
Rajole: పైడిదాసు వెన్నెముక చికిత్సకు రూ.2.02 లక్షల సీఎంఆర్‌ఎఫ్ ఎల్‌ఓసీ మంజూరు!
Rajole: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండలం పడమటిపాలెం గ్రామానికి చెందిన నల్లి పైడిదాసు కొంతకాలంగా వెన్నెముక సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన అమలాపురం కిమ్స్ ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని సూచించారు.
అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటంతో ఖరీదైన వైద్య చికిత్సకు అయ్యే ఖర్చును భరించడం కుటుంబ సభ్యులకు ఇబ్బందిగా మారింది. దీంతో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా ఆర్థిక సాయం అందించాలని వారు ప్రయత్నించారు.
ఈ విషయాన్ని రాజోలు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్, రాష్ట్ర అధికార ప్రతినిధి గొల్లపల్లి అమూల్య దృష్టికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. పైడిదాసు ఆరోగ్య పరిస్థితి, కుటుంబ ఆర్థిక ఇబ్బందులను వివరించి CMRF ద్వారా LOC మంజూరు చేయించాలని కోరారు.
కుటుంబ సభ్యుల విజ్ఞప్తిపై స్పందించిన గొల్లపల్లి అమూల్య సంబంధిత అధికారులతో మాట్లాడి రూ.2,02,754 విలువైన CMRF LOC మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకున్నారు. మంజూరైన LOCను బుధవారం పైడిదాసు కుమార్తె శ్రీమతి శ్రీదేవికి గొల్లపల్లి అమూల్య అందజేశారు.
తన తండ్రి వైద్య చికిత్సకు ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకున్న గొల్లపల్లి అమూల్యకు శ్రీదేవి, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. CMRF ద్వారా మంజూరైన ఈ ఆర్థిక సాయం శస్త్రచికిత్సకు ఎంతో ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు.




