Amalapuram: కోనసీమ రైల్వే లైన్‌కు రాష్ట్ర వాటా రూ.100 కోట్లు: ఎంపీ హరీష్
Amalapuram: కోనసీమ రైల్వే లైన్ కోసం రాష్ట్ర వాటా తొలి విడతగా రూ.100 కోట్లను త్వరలోనే విడుదల చేస్తున్నట్లు ఎంపీ హరీష్ బాలయోగి ప్రకటించారు.
Amalapuram: కోనసీమ రైల్వే లైన్‌కు రాష్ట్ర వాటా రూ.100 కోట్లు: ఎంపీ హరీష్
Amalapuram: అమలాపురంలో మాజీ లోక్ సభ స్పీకర్ స్వర్గీయ దివంగత నేత జిఎంసి బాలయోగి 75వ జయంతి వేడుకలు బాలయోగి గాట్ లోని ఘనంగా జరిగాయి.
అమలాపురంలోని బాలయోగి ఘాట్ వద్ద జయంతి వేడుకల్లో పాల్గొన్న తనయుడు ఎంపీ హరీష్ బాలయోగి ఎమ్మెల్యేలు బుచ్చిరాజు,ఆనందరావు,గిడ్డి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
జీఎంసీ బాలయోగికి నివాళులర్పించి 75 సంవత్సరాలు సందర్భంగా 75 కేజీల కేకును కట్ చేసిన తనయుడు ఎంపీ హరీష్ బాలయోగి,ఎమ్మెల్యేలు, కూటమి నేతలు.హరీష్ బాలయోగి మాట్లాడుతూ నా తండ్రి బాలయోగి చిరకాల కోరిక కోనసీమ రైల్వే లైన్ పూర్తి చేసి తీరుతా తీరుతానని కోనసీమ ప్రజలకు హామీ ఇచ్చాన ఎంపీ హరీష్ బాలయోగి.కోనసీమ రైల్వే లైన్ కు రావలసిన రాష్ట్ర వాటాలో మొదటి విడతగా 100 కోట్లు విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారు.
అతి త్వరలోనే మొదటి విడతగా రాష్ట్ర వాటా 100 కోట్లు విడుదల చేయనుంది కూటమి ప్రభుత్వం అని ఎంపీ హరీష్ బాలయోగి అన్నారు. 100 కోట్లతో ల్యాండ్ అక్విజేషన్ పూర్తి చేసి కేంద్ర వాటా నిధులు తీసుకువచ్చి కోనసీమ రైల్వే లైన్ పనులు వేగవంతం చేస్తాం అని అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి కొనియాడారు.
తన తండ్రి 75వ జయంతి సందర్భంగా కోనసీమలోని ప్రజలకు అందుబాటులో మూడు అత్యాధునిక అంబులెన్సులు ఏర్పాటు చేయడంతోపాటు మూడు వేల మందికి హెల్త్ కార్డ్స్ చేయించిన తనయుడు ఎంపీ హరీష్ బాలయోగి తెలియజేసారు. త్వరలో బాలయోగి 75 వసంతాల వేడుక ఘనంగా నిర్వహిస్తామని తెలిపిన ఎంపీ హరీష్ బాలయోగి అన్నారు.




