Kadiyam: కడియం జక్కంపూడి నగర్‌లో కూలిన రిటైనింగ్ వాల్!
Kadiyam: తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి జక్కంపూడి నగర్‌లో భారీ వర్షాలకు కూలిన రిటైనింగ్ వాల్.
Kadiyam: కడియం జక్కంపూడి నగర్‌లో కూలిన రిటైనింగ్ వాల్!
Kadiyam: తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి జక్కంపూడి నగర్ లో తుఫాన్ ప్రభావంతో మంగళవారం 3 ఇల్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలతో కొండచరియకు ఆనుకొని నిర్మించిన రిటైనింగ్ వాల్ కూలి పక్కనే ఉన్న మూడు ఇళ్ల పై పడింది.దీంతో సమీపంలో ఉన్న కరణం అచ్చయ్య, శంభాని లక్ష్మణరావు,కరణం సత్యవతి లకు చెందిన నివాస గృహాలు నష్టపోయాయి.
సమాచారం తెలుసుకొన్న మండల టిడిపి అధ్యక్షులు సంఘటనా స్థలానికి వెళ్లి బాధితులకు ధైర్యం చెప్పారు. అధికారులతో మాట్లాడి నష్ట పరిహారాన్ని అంచనా వేసి ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యే గోరంట్ల దృష్టికి తీసుకువెళ్లి బాధితులకు తగిన న్యాయం చేస్తామని నాని హామీ ఇచ్చారు.
లోతట్టు ప్రాంతాల్లో నివాసితులు అప్రమత్తంగా ఉండాలని,అవసరమైతే అటువంటి వారికి ఆశ్రయం కల్పించే చర్యలు తీసుకొంటామని నాని ఈ సందర్భంగా తెలిపారు.




