Razole: స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా సాగాలి తెన్నేటి కిషోర్!

Razole: స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులకు రక్షణ కల్పించాలని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి తెన్నేటి కిషోర్ డిమాండ్ చేశారు. దాడులపై విచారణ కోరారు.

PRABHU, RAZOLE
Published on: 16 Oct 2026 6:56 PM IST
Razole
X

Razole: స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా సాగాలి తెన్నేటి కిషోర్!

రాజోలు: స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల భద్రతకు, నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎన్నికల కమిషన్‌ తగిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తెన్నేటి కిషోర్‌ కోరారు. పుంగనూరులో చైర్మన్‌ అభ్యర్థి నామినేషన్‌ దాఖలు సమయంలో ఎదురైన ఇబ్బందులపై విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.

తిరుపతి, రాయచోటి తదితర ప్రాంతాల్లో తమ పార్టీ నాయకులపై దాడులు జరిగినట్లు వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, బాధ్యులుగా నిర్ధారణ అయిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలను పరిరక్షిస్తూ, అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు కల్పించాలని అన్నారు.

ఎన్నికల ప్రక్రియపై వచ్చిన ఫిర్యాదులను సమీక్షించి, అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని తెన్నేటి కిషోర్‌ విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE