Razole: 27వ రోజుకు చేరిన వీఆర్ఏల సహాయ నిరాకరణ ఉద్యమం
Razole: పే స్కేలు అమలు, నామినీ వీఆర్ఏల క్రమబద్ధీకరణ డిమాండ్లతో రాజోలులో గ్రామ రెవెన్యూ సహాయకుల సహాయ నిరాకరణ ఉద్యమం 27వ రోజుకు చేరుకుంది.
Razole: 27వ రోజుకు చేరిన వీఆర్ఏల సహాయ నిరాకరణ ఉద్యమం
రాజోలు: అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు మండలంలో వీఆర్ఏలు చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం 27వ రోజుకు చేరుకుంది. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని రాజోలు మండల గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం పేర్కొంది.
వీఆర్ఏలకు పే స్కేలు అమలు చేయాలని, ఏళ్ల తరబడి నామినీ వీఆర్ఏలుగా పనిచేస్తున్న వారిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని సంఘం స్పష్టం చేసింది.




